News

ఈ నెల 24న రాహుల్‌గాంధీ అనంతపురం జిల్లా


అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్‌గాంధీ ఈ నెల 24వ తేదీన పర్యటించనున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. నల్లమాడ నుంచి ఓడిచెరువు వరకు రాహుల్‌ పాదయాత్ర చేస్తారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు దోచుకోవడం, దాచుకోవడం పనిగగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. రెవెన్యూ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే దాడిని ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. విభజన చట్టంలోని 130 సెక్షన్లను అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.